మెంతి ఆకు - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


మెంతి ఆకులలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీన్ని ఏదైనా కూరగాయలతో సులభంగా కలిపి వండుకోవచ్చు. మెంతి ఆకులను బంగాళాదుంపలతో కలపి వండడంతో చాలా ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే మీ రెగ్యులర్‌గా తీసుకునే టీలో కూడా ఉపయోగించవచ్చు. మెంతి ఆకుల్లో విటమిన్ సీ, ఏ, ఐరన్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. 

మెంతి ఆకులు విటమిన్ సీని కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతోంది. అలాగే ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే కాల్షియం కూడా ఇందులో ఉంటుంది. మాంగనీస్ తక్కువగా ఉంటుంది. కానీ, మెదడుకు చాలా మంచిది. మెంతి ఆకులు మంచి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే మలబద్దకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. గ్యాస్ సమస్య నుంచి బయటపడేసేందుకు మెంతులు సహాయపడతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది.

జీవనశైలి కారణంగా చాలా మంది  చక్కని  నిద్రకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. చక్కని నిద్ర లేకపోవడం వల్ల సోమరితనం, చిరాకుగా ఉంటుంది. మెంతుల్లో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ బీని కలిగి ఉంటాయి. ఇవి నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు సహాయపడుతుంది. శరీరంలో కార్టిసాల్ స్థాయిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది.

సోయా ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం టీ లేదా గ్రీన్ టీలో మెంతి ఆకులను కలిపి తాగవచ్చు. ఇది కొవ్వును కరిగించేందుకు బాగా పనిచేస్తోంది. కొన్ని మెంతి ఆకులను నీటిలో ఉడకబెట్టి, వడకట్టుకుని తాగితే, జీవక్రియను పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)