అనుమతి కోసం క్యూలో....!

Telugu Lo Computer
0


ఖద్దరు పై పేటెంట్ హక్కులు భారత దేశానికి మాత్రమే ఉన్నాయి. దీంతో ఇతర దేశాలు తమ దేశాల్లో ఖాధీ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల అనుమతికోసం భారత్ వద్దకు క్యూ కడుతున్నాయి. విదేశాలలో ఖాదీ ఉత్పత్తులు విక్రయించుకోవాలంటే అందుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. దీంతో అనేక దేశాలు ప్రస్తుతం ఖాదీ బ్రాండ్ విక్రయాలకు రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ధరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఖాదీ ఇండస్ట్రీస్ కమిషన్ జర్మనీ, యూకే, రష్యా, చైనా, అస్ట్రేలియా, ఈయూ దేశాలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే తాజాగా మెక్సికో, భూటాన్, యూఏఈ దేశాలు ఖాధీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పూర్తై అనుమతులు పొందాయి. అదే క్రమంలో అగ్రరాజ్యంమైన అమెరికాతోపాటు మరో 43 దేశాల రిజిస్ట్రేషన్ల అనుమతులకు సంబంధించిన అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)