సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


కోల్‌కతాలోని లేక్ టౌన్ ప్రాంతంలో ఉన్న “మినీ జయ” సినిమా హాలులో రాత్రి గం.9-15 సమయంలో మంటలు వ్యాపించాయి. లాక్ డౌన్ కారణంగా సినిమా హాల్ మూసి ఉంది. సినిమాహాల్ పై భాగంలో వాచ్‌మెన్ కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం రాత్రి వాచ్‌మెన్ భార్య కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాధమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను రక్షించే క్రమంలో వాచ్‌మెన్ కు గాయాలయ్యాయి. ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి సుజిత్ బోస్ ఘటనా స్ధలానికి వచ్చి పరిస్ధితిని సమీక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)