బాదుడే..... బాదుడు!

Telugu Lo Computer
0


గడిచిన ఏడు రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఇప్పటికే ధరలు ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరగా.. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 30 పైసలు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.95.31, డీజిల్‌ రూ.86.22కు చేరింది. ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.52, డీజిల్ రూ.93.58కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.95.28, డీజిల్ రూ.89.0, చెన్నైలో పెట్రోల్ రూ. 96.71, డీజిల్ రూ.89.07, లక్నోలో పెట్రోల్ రూ.92.56, డీజిల్ రూ.86.62, జైపూర్‌లో పెట్రోల్ రూ.101.88, డీజిల్ రూ.95.81, నోయిడాలో పెట్రోల్ రూ.92.67, డీజిల్‌ రూ.86.70 కు చేరింది.

బెంగళూరులో పెట్రోల్‌ రూ.98.49, డీజిల్ రూ.91.41, భోపాల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.45, డీజిల్ రూ.94.79కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.05, డీజిల్‌ రూ.94కు చేరింది. గత నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నుంచి ఇప్పటి వరకు 20 సార్లు ధరలు పైకి కదిలాయి. పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.వంద దాటింది. దేశంలో అత్యంత గరిష్ఠ స్థాయికి రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.105 దాటింది. డీజిల్‌ ధర సైతం వందకు చేరువైంది. ప్రస్తుతం డీజిల్ లీట‌ర్‌ ధర రూ.98 పలుకుతోంది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)