జి-7 దేశాలను హెచ్చరించిన చైనా

Telugu Lo Computer
1

 


''చిన్న'' కూటముల దేశాలు (జి-7 సమ్మిట్‌) ప్రపంచాన్ని శాసించే రోజులు పోయాయని జి-7 దేశాలను చైనా హెచ్చరించింది. చైనాకు ధీటుగా ఏకీకృత విధానాన్ని తీసుకురావాలని జి-7దేశాలు చర్చిస్తున్న తరుణంలో.. వాటిని తిప్పి కొడుతూ చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. చిన్న కూటముల దేశాలు ప్రపంచ భవిష్యత్‌ను నిర్ణయించే రోజులు గతంలో ఉండేవని.. కానీ ఇప్పుడు అది చెల్లదని లండన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. పెద్ద లేదా చిన్న, బలమైన లేదా బలహీనమైన, పేద లేదా ధనిక దేశాలన్న తేడాలను తాము గమనించమని.. అన్ని దేశాలు సమానమన్న భావనను తాము విశ్వసిస్తామని అన్నారు. అలాగే అన్ని దేశాలతోనూ సంప్రదించి ప్రపంచ వ్యవహారాలపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

Post a Comment

1Comments

  1. >> ..... అన్ని దేశాలు సమానమన్న భావనను తాము విశ్వసిస్తామని .....
    ఈమాటను సరిగ అర్ధం చేసుకోండి. చైనా దృష్టిలో అన్ని దేశాలు సమానమన్న భావన తాత్పర్యం ఏమిటంటే ప్రపంచంలోని అన్నిదేశాలు తమ పెత్తనంలో ఉండవలసినవే అని. చైనా ప్రపంచాధినేతగా ఉండాలని విశ్వసిస్తున్నది. దాని అర్ధం చైనాకు ప్రపంచంలో మిగిలిన అన్ని దేశాలూ సామంతరాజ్యాలే అన్నమాట. ఈధోరణిని అణచివేయకపోతే ప్రపంంచం చాలా పెద్దమూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ప్రపంచం అంతా దెబ్బతినే‌కంటే ఆదెబ్బ ఏదో చైనా తినటమే ప్రపంచశాంతికి మార్గం. తస్మాత్ జాగ్రత!

    ReplyDelete
Post a Comment