దివ్య ఔషదం..!

Telugu Lo Computer
0


గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో 'ఎ' విటమిన్‌, బి కాంప్లెక్స, సి,ఇ,కె విటమిన్లు, కాల్షియం, ఐరన్‌,మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సెలీనియమ్‌,సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసులోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది. దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయలేము. గోధుమ మొలకలను న్యూట్రిషనల్‌ రిజర్వాయర్‌గా పౌష్టికాహార నిపుణులు గుర్తిం చారు. 

అధిక రక్తపోటు నివారిణి: తీవ్ర హృద్రోగ సమస్యలకు లేత గోధుమ ఆకుల పౌడర్ దివ్యౌషదం. లోపాన్ని నివారిస్తుంది. గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: జీవకణాల్లో నిల్వ ఉండే ఉప్పునీరు, రసాయనాలు, లోహ సంబంధాలు, మత్తు పదార్థాలు, వ్యర్థాలను బయటకు పంపించి రోగనిరోధక శక్తి పెంచుతుంది. ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుటపడుతుంది.

శక్తి ప్రదాయిని/నూతనోత్తేజం కలిగిస్తుంది: గోధుమ గడ్డి రసంలో ప్రొటీన్లు, ఎంజైమ్స్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉన్న కారణాన ఈ రసాన్ని సేవించిన వారికి శక్తిని చేకూరుస్తుంది. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్‌ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనో త్తేజం కలిగిస్తుంది. బొడ్డు కొవ్వు తగ్గించడానికి నెయ్యి తింటే సరిపోతుంది ..! లోపల ఇంకా చాలా ప్రయోజనాలు ... బరువు తగ్గించడానికి: గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. కొవ్వు శాతాన్ని కరిగించి అధిక బరు వును, పొట్టను తగ్గిస్తుంది. ఇది శరీరంలోని మెటబాలిజంను సరిచేస్తుంది. క్యాన్సర్‌ నివారిణి: గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌,బీటా కెరోటిన్‌, బయో ఫ్లావో నాయిడ్‌, బి,సి,ఇ విటమిన్ల కారణాన క్యా న్సర్‌ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. మధుమేహానికి: ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. చర్మ రక్షణ: ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కన్నుల కింద నల్లటి వల యాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక పరిశ్రమ గోధుమగడ్డి రసాన్ని వారిఉత్పత్తులలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానికగా పని చేస్తుంది. రోజూ ఆహారంలో గోధుమ గడ్డి రసాన్ని ఒక పోషక పదార్థంగా ఉపయోగించవచ్చు: ఈ రసాన్ని ఆరెంజ్‌, యాపిల్‌, ఫైనాఫిల్‌, లెమన్‌ తది తర జ్యూస్‌లతో కలిపి తాగవచ్చు. గోధుమ గడ్డి పొడిని కూడా పోషక పదార్థంగా వాడవచ్చును. కేశ సంరక్షణకు: గోధుమ ఆకుల పౌడర్‌ ఆహారంగా తీసుకున్నట్లయితే, జుత్తు రాలడం, తెల్లబడడం తగ్గుతుంది. థైరాయిడ్: థైరాయిడ్‌ సమస్యను పోగొడుతుంది. రుతు సమస్యకు: రుతు సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం: గోధుమ ఆకుల పౌడర్‌ వాడినట్లయితే మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు. ఎసిడిటి/గ్యాస్ట్రిక్: ఎసిడిటీని తగ్గిస్తుంది. గ్యాస్ట్రబుల్ను పోగోడుతుంది. కొవ్వు శాతాన్ని కరిగించి అధికబరువును, పొట్టను తగ్గిస్తుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)