భయపడకండి......!

Telugu Lo Computer
0

 

వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా మంది భయపడినట్లుగానే  నేను మొదట్లో చాలా భయపడ్డాను. మొన్నసూపర్ స్ప్రెడర్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. కాసేపు అక్కడే కూర్చున్న,  ఏమి అనిపించలేదు కాస్త టెన్షన్ ఉండే, ఇంటికి వచ్చాను చెమటలు పట్టాయి. తల తిప్పినట్టు అనిపించింది. జ్యూస్ తాగాను, పారాసెటమాల్ 650 టాబ్  వేసుకున్నా, ఇంకా ఫీవర్ ఎక్కువ అయింది. నైట్ అయింది, నిద్ర రావడం లేదు. ఒళ్ళంతా వేడి. అస్సలు కదలడానికి కూడా ఓపిక లేదు. అలాగే పడుకున్నా,  లైట్ గా ఫుడ్ తిని మళ్ళీ టాబ్ వేసుకున్నా,  అయినా నిద్ర పట్టలేదు. అసలు వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నానా  అనిపించింది... ఉదయం 10 అయింది. టిఫిన్ తిని టాబ్ వేసుకుని  మళ్ళీ రెస్ట్ తీసుకున్నా. కాస్త ఫ్రీ  అనిపించింది... అటు ఇటు నడవడం  ఫ్రూట్స్ తినడం టాబ్స్ వేసుకోవడం... ఏమి ఆలోచించకుండా, ఏమి వర్క్ చేయకుండా నేను బాగా రెస్ట్ తీసుకున్నాను. ఈ రోజు నుంచి నా పనులు నేను చేసుకుంటున్నా.  వ్యాక్సిన్ వేశారు కదా.. కాస్త చేయి నొప్పిగా ఉంది అంతే...వ్యాక్సిన్ వల్ల  భయపడాల్సిన అవసరం లేదు. ఎవరూ  భయం పడకండి.  చక్కగా వెళ్లి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి... ఈ కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా , ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే...!!

Post a Comment

0Comments

Post a Comment (0)