లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయటం ఎలా?

Telugu Lo Computer
1

టపాలో, ఉబుంటు లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌కు ఎలా కనెక్ట్ చెయ్యాలో వ్రాయటం జరిగింది, ఇది మరి కొన్ని gnome లినక్సులకు కూడా వర్తించవచ్చు.


టెర్మినల్ తెరవటానికి, Alt+F2 నొక్కి gnome-terminal అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే చాలు.

టెర్మినల్ లో sudo pppoeconfఅని టైప్ చేసి ఎంటర్ నొక్కితే అడ్మినిస్ట్రేటర్ పాస్‌వర్డ్ కోసం అడుగుతుంది, పాస్‌వర్డ్ ఇవ్వగానే ఎస్ ఆర్ నోఅని అడుగుతుంది, ఇలాకనిపించిన ప్రతి సారీ ఎంటర్ నొక్కటామే మనం చెయ్యవలసినది.

http://www.techotopia.com/images/1/12/Ubuntu_linux_ppoeconf.jpg

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్


కాసేపు ఉన్న అవకాశాల కోసం స్క్యాన్ చేస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ username password అడుగుతుంది. అవి ఇవ్వటం ఎంటర్ నొక్కటం, ఇదే మనం చెయ్యవలసింది. ఇలా మొదటి సారి చేశాక, మీరు కంప్యూటర్ ఆన్ చేసిన ప్రతి సారీ దానంతటదే ఇంటెర్నెట్‌కు కనెక్ట్ ఐపోతుంది.

కనెక్ట్ అయ్యిందో లేదో చూడటానికి Firefox తెరిచి ఏదైనా వెబ్సైట్ వెళ్ళటానికి ప్రయత్నించి చూడండి.

Post a Comment

1Comments

  1. నేను లినక్స్‌లో నెట్ చెయ్యడానికి ఐడియా నెట్‌సెట్టర్ ఉపయోగిస్తాను. నేను wvdial కమాండ్ ఉపయోగిస్తాను.
    http://www.facebook.com/photo.php?fbid=110911829060081&set=a.110911822393415.20870.100004237920347&type=1

    ReplyDelete
Post a Comment