బెంగళూరులో వింటేజ్‌ కార్ల ర్యాలీ !

Telugu Lo Computer
0


లోక్‌సభ 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఓటర్లలో అవగాహన పెంచేందుకు, ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారి, బీబీఎంపీ చీప్ కమిషనర్‌ 'తుషార్‌ గిరినాథ్‌' వింటేజ్‌ కార్‌, బైక్‌ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. చదువుకున్న వారిలో కూడా చాలామంది ఓటు వేయడానికి ఆసక్తి చూపడటం లేదు. ఇలాంటి విధానానికి స్వస్తి పలకడానికి పాతకాలపు కార్లు, బైకులతో బెంగళూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పాతకాలపు కార్ల ర్యాలీ నిర్వహించే సమయంలో జిల్లా రిటర్నింగ్ అధికారి, చీఫ్ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌.. అక్కడున్న వారందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీ విధాన సౌధ నుంచి ప్రారంభమై.. ఇన్‌ఫ్యాంట్రీ రోడ్డు, ఎంజీ రోడ్డు, చిన్నస్వామి స్టేడియం, ట్రినిటి సర్కిల్‌, రెసిడెన్సీ రోడ్డు మీదుగా కంఠీరవ స్టేడియం వద్ద ముగిసింది. సుమారు వందేళ్ల నాటి అపురూపమైన కార్లు నగర వీధుల్లో దూసుకెళ్తుంటే నగరవాసులు చాలా ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం ప్రత్యేక కమిషనర్ సెల్వమణి, జిల్లా స్వీప్ కమిటీ చైర్మన్ కాంతరాజు, స్వీప్ నోడల్ అధికారిణి ప్రతిభ మొదలైన వారు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)