ఊసరవెల్లిలా రంగులు మార్చొద్దు !

Telugu Lo Computer
0

చ్చతీవు ద్వీప వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి .చిదంబరం మండిపడ్డారు . ఎక్స్‌.కామ్‌ వేదికగా జయ్‌శంకర్‌ ఊసరవెల్లిలా రంగులు  మార్చొద్దని అన్నారు. 'టిట్ ఫర్ టాట్' అనేది పాతది.. ట్వీట్‌ ఫర్‌ ట్వీట్‌ అనేది ట్వీట్ కొత్త ఆయుధం' అని పేర్కొన్నారు. అంతేకాదు, 2015 జనవరి 27 నాటి ఆర్టీఐ సమాధానాన్ని ఒకసారి చూడండి. కచ్చితీవును శ్రీలంకకు చెందినదిగా ఇండియా గుర్తించడాన్ని ఆర్‌టీఐ సమర్ధించిందని గుర్తు చేశారు. పరోక్షంగా జయ్‌ శంకర్‌ను ఉద్దేశిస్తూ ఒక ఉదారవాద అధికారి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌- బీజేపీ మౌత్‌ పీస్‌ వరకు ఆయన చేసిన విన్యాసాలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రజలు ఎంత వేగంగా రంగులు మారుస్తుంటారో అని చిందబరం ట్వీట్ చేశారు మరో ట్వీట్‌లో గత 50 ఏళ్లలో భారతీయ మత్స్యకారులు శ్రీలంకలో నిర్బంధించబడ్డారని అంగీకరించారు. అయితే బీజేపీ, మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే జరగలేదా అని ప్రశ్నించారు. 'గత 50 ఏళ్లలో మత్స్యకారులను నిర్బంధించిన మాట వాస్తవమే. అదేవిధంగా భారతదేశం అనేక మంది మత్స్యకారులను నిర్బంధించింది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంక మత్స్యకారులను నిర్బంధించలేదా? మోడీ అధికారంలో ఉన్నప్పటి నుండి మత్స్యకారులను శ్రీలంక నిర్బంధించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)