'హెల్త్‌ డ్రింక్‌' అనే పదాన్ని తొలగించండి !

Telugu Lo Computer
0

చాక్లెట్ మాల్ట్ డ్రింక్ మిశ్రమాల బ్రాండ్‌లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పలు తయారీ కంపెనీల వెబ్‌సైట్‌లు, ఇతర మాద్యమాల్లో పలు చాక్లెట్ మాల్ట్ డ్రింక్ ఉత్పత్తులపై 'హెల్త్‌ డ్రింక్‌' అనే పదాన్ని తొలగించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈకామర్స్‌ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ)కి సబ్మిట్‌ చేసిన మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ (బోర్న్‌వీటా తయారీ కంపెనీ) సమర్పించిన నియమాలు, నిబంధనల్లో బోర్న్‌వీటా 'హెల్త్‌ డ్రింక్‌'గా నమోదు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్‌), బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (సీపీసీఆర్‌) చట్టం 2005 సెక్షన్ (3) సీఆర్‌పీసీ చట్టం 2005లోని సెక్షన్ 14 కింద విచారణ జరిపిన తర్వాత బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యమైన పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉందని ఎన్‌సీపీసీఆర్‌ చేసిన పరిశోధన నేపథ్యంలో ఈ కీలక ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు, భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన పవర్ సప్లిమెంట్లను 'హెల్త్ డ్రింక్స్'గా విక్రయాలు జరుపుతున్న కంపెనీలపై చర్య తీసుకోవాలని ఎన్‌సీపీసీఆర్‌ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీని కోరింది. ముఖ్యంగా, రెగ్యులేటరీ బాడీ ప్రకారం దేశంలోని ఆహార చట్టాలలో 'హెల్త్ డ్రింక్' అని ఎక్కుడా వినియోగించకూడదు. కాదని హెల్త్‌ డ్రింక్‌ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తే సదరు కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. కాగా, ఈ నెల ప్రారంభంలో, డైరీ ఆధారిత లేదా మాల్ట్ ఆధారిత పానీయాలను 'హెల్త్ డ్రింక్స్'గా లేబుల్ వినియోగించడాన్ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. హెల్త్‌ డ్రింక్‌ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తుంటే వెంటనే వాటిని నిలిపివేయాలని ఈ-కామర్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)