కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు !

Telugu Lo Computer
0


లిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్‌ కోర్టు కస్టడీకి ఇవ్వడం అక్రమమని అరవింద్‌  కేజ్రీవాల్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్‌ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ తనను ఈడీ అరెస్టు చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గత వారం పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కేజ్రీవాల్‌ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు ఈరోజు దానిని వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్‌ స్కామ్‌కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్రపన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణం‍తో లిక్కర్‌ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్‌ అరెస్టు సబబేనని హైకోర్టు అభిప్రాయపడింది.


Post a Comment

0Comments

Post a Comment (0)