కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా వారి ధ్యాసంతా కమీషన్ల మీదే ఉండేది !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శనివారం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ''కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా వారి ధ్యాసంతా కమీషన్ల మీదే ఉండేది. ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఆ కమీషన్ల కోసమే అధికారం కోరుకుంటోంది. ఎన్డీయే, మోడీ సర్కారు మాత్రం ఓ మిషన్‌ కోసం పని చేస్తోంది. భాజపా 370 సీట్లలో గెలవకుండా ఆపడానికి విపక్షాలు విఫలయత్నం చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ గంటకో అభ్యర్థిని మారుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తాము బలమైన సీటుగా భావించే చోట్ల కూడా కనీసం అభ్యర్థులను బరిలో దింపే సాహసం చేయడం లేదు'' అని మోడీ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టోపైనా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. అందులో ముస్లింలీగ్‌ ముద్ర, వామపక్ష భావజాలం కలిగిన వారి ఆధిపత్యం కనిపిస్తోందన్నారు. అనిశ్చితికి, అస్థిరతకు పర్యాయపదంగా ఇండియా కూటమి తయారైందన్నారు. ప్రజలు కూడా వారిని సరిగా పట్టించుకోవడం లేదన్నారు. యూపీలో 8 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. అందులో షహరాన్‌పూర్‌తో పాటు కైరానా, ముజఫర్‌ నగర్‌, బిజ్నోర్‌, నాగిన, మొరాద్‌బాద్‌, రాంపూర్‌, పిల్‌భిత్‌ స్థానాలు ఉన్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)