లావోస్‌లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేర్చిన కేంద్ర ప్రభుత్వం !

Telugu Lo Computer
0

ద్యోగాల పేరుతో ఆగ్నేయాసియా దేశమైన లావోస్‌లో 17 మంది భారతీయులు చిక్కుకుపోయారు. వారందరినీ భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. దీనిపై విదేశాంగమంత్రి జైశంకర్ మాట్లాడుతూ ఇది '' మోడీ గ్యారెంటీ'' అని అన్నారు. లావోస్‌లో భారత రాయబార కార్యాలయాన్ని జైశంకర్ ప్రశంసించారు. లావోస్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ వేదికగా జైశంకర్..'' మోడీ గ్యారెంటీ స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా పనిచేస్తుంది. లావోస్ అసురక్షిత, చట్టవిరుద్ధమైన పనిలో చిక్కుకున్న 17 మంది భారతీయ కార్మికులు స్వదేశానికి తిరిగి వచ్చారు'' అని ట్వీట్ చేశారు. లావోస్ భారత రాయబార కార్యాలయం చాలా బాగా పనిచేసిందని, లావోస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కంబోడియాలో లాభదాయకమైన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వాగ్దానం చేస్తూ మానవ అక్రమ రవాణాదారుల బారిన పడకుండా భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం హెచ్చరించింది. ఆయా దేశాల్లో ఉద్యోగవకాశాల కోసం వెతుకుతున్న భారతీయులు, తమ యజమాని నేపథ్యాన్ని క్షణ్ణంగా తనిఖీ చేయాలని మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది. కంబోడియాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)