విమానంలో రేవంత్ రెడ్డి పక్కన కూర్చుని దిగిన ఫొటో అంటూ పాప్ సింగర్ స్మిత ఎక్స్ లో పోస్ట్ !

Telugu Lo Computer
0

                                                       

పాప్ సింగర్ స్మిత సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. స్మిత సీఎం రేవంత్ తో కలిసి దిగిన ఫొటోను ఎక్స్ పోస్ట్ చేశారు. అయితే స్మిత సీఎం రేవంత్ ను ప్రత్యేకంగా కలవలేదు. రేవంత్ రెడ్డిని విమానంలో వెళ్తున్నప్పుడు కలిసినట్లు స్మిత తెలిపారు. సీఎం కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆ ఫొటోతో పాటు చాలా కాలం తర్వాత ఎవరిని ఎక్కడ కలిశానో చూడండి అంటూ రాసుకొచ్చారు. అత్యంత సాధారణ సీఎంల్లో రేవంత్ రెడ్డి ఒకరని స్మిత ప్రశంసించారు. సీఎం సాధారణ ప్రయాణికుల్లా అందరితో కిలసి కమర్షియల్ విమానంలో ప్రయాణించారని పేర్కొన్నారు. విమానంలో రేవంత్ రెడ్డి పక్కన కూర్చుని దిగిన ఫొటో అంటూ ఎక్స్ పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. రేవంత్ ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది. దీంతో ఆయన పలు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)