ఇజ్రాయెల్‌కు ఉక్కు కవచంలా ఉంటామన్న బైడెన్ !

Telugu Lo Computer
0


జ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తాజాగా ప్రకటించారు. ''భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్‌ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని నేను నెతన్యాహుకు తెలిపాను. దీంతో శత్రువులు తనను ఏమీ చేయలేరని వెల్లడించినట్లైంది. మేం ఇజ్రాయెల్‌కు ఉక్కుకవచంలా ఉండటానికి కట్టుబడి ఉన్నాం. ఇరాన్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశాం. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం. ఈ దాడులను నేను ఖండిస్తున్నాను' అని పేర్కొన్నారు. అంతకు ముందే.. ఆయన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో టెలిఫోన్‌లో మాట్లాడారు. దీంతోపాటు జీ7 దేశాధినేతలతో కూడా బైడెన్‌ సంభాషించనున్నారు. ఇరాన్‌ దాడిపై సమన్వయంతో దౌత్యమార్గంలో స్పందించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌ నేతలతో తన బృంద సభ్యులు టచ్‌లో ఉంటారని పేర్కొన్నారు. అమెరికా దళాలు ఇరాన్‌ ప్రయోగించిన దాదాపు 70కిపైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్‌ క్షిపణులను కూల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు స్పందించాయని పేర్కొన్నారు. ఇరాన్‌ మొత్తం 100కుపైగా బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)