ఫూల్ మఖానా - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ఫూల్ మఖానా వీటినే తామర గింజలు, మఖానా అని కూడా అంటారు. వీటితో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఫూల్ మఖానాతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ మధ్య కాలంలో ఫూల్ మఖానా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా మంది వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మొదలు పెట్టారు. కూరలే కాకుండా ఈ ఫూల్ మఖానాను నెయ్యిలో వేయించి చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. ఫూల్ మఖానాను నెయ్యితో తీసుకోవడం వల్ల రుచితో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. నెయ్యితో వేయించిన ఫూల్ మఖానాను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్ వంటి ఎన్ఓ పోషకాలు ఉంటాయి. నెయ్యి, మఖానాను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  కడుపు ఉబ్బర, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. నెయ్యిలో వేంచిన మఖానాను స్నాక్స్ గా తీసుకోవడం వల్ల ఇతర చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు నెయ్యిలో వేయించిన మఖానాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మఖానాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. నెయ్యితో మఖానాను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. నీరసం, బలహీనత వంటివి దరి చేరకుండా ఉంటాయి. నెయ్యితో మఖానాను కలిపి తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మఖానాలో క్యాల్షియం ఉంటుంది. నెయ్యి తీసుకోవడం వల్ల విటమిన్ డి శోషణ పెరుగుతుంది. తద్వారా ఎముకలు ధృడంగా తయారవుతాయి. బోలు ఎముకలు, ఎముకలు గుళ్లబారడం వంటివి తగ్గుతాయి. అలాగే నెయ్యిలో వేయించిన మఖానాను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మఖానాలో పొటాషియం ఉంటుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మఖానా యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. నెయ్యితో కలిపి వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు మఖానాను నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల శక్తి తగ్గకుండా ఎల్లప్పుడూ ఒకేవిధంగా ఉంటుంది. అలాగే నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. నెయ్యితో కలిపి మఖానాను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అదేవిధంగా నెయ్యిలో వేయించిన మఖానాను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అలాగే మఖానాను నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా నెయ్యితో మఖానాను కలిపి చిరుతిండిగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారికి చక్కటి ఆరోగ్యాన్ని అందించిన వాళ్లం అవుతామని నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)