నవాడా బహిరంగ సభలో సీఎం నితీష్‌కుమార్ కు అవమానం !

Telugu Lo Computer
0


బీహార్‌లో ప్రధాని మోడీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు. బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవాడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కూటమిలో భాగంగా బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ సైతం హాజరయ్యారు. అయితే ఈ సభలో సీఎం నితీష్‌ కుమార్‌కు సొంత పార్టీల నేతల నుంచి తీవ్రం అవమానం జరిగింది. నవాడాలో లోక్‌సభ ఎన్నికలను ఉద్దేశిస్తూ భారీ బహిరంగ సభలో నితీష్‌ కుమార్‌ 25 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో నితీష్‌ కుమార్‌ పలు మార్లు తడబడ్డారు. 400కు బదులు 4000 మందికి పైగా ఎంపీల గెలుపుతో మోడీ తిరిగి ప్రధాని అవుతారని అన్నారు. సీఎం నితీష్‌ ప్రసంగిస్తుండగా.. ఆ పార్టీల నేతలు వాచీలు చూసుకుంటూ మీ ప్రసంగం ఇంక చాలంటూ చేతులతో సంజ్ఞలు చేశారు. జనతాదళ్ యునైటెడ్ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి వేదిక ముందు వరుసలో కూర్చొని తన గడియారాన్ని తనిఖీ చేస్తూ కదులుతూ కనిపించారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రికి తన ప్రసంగాన్ని ముగించమని సైగలు చేశారు. పలువురు నాయకులు పోడియం వైపు అసహనంగా ఎదురుచూస్తూ కనిపించారు. దీంతో చేసేది లేక రెండు నిమిషాల తర్వాత తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. అనంతరం ప్రధాని మోడీ, నితీష్‌ కుమార్‌ ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు. 'మీరు మంచి ప్రసంగం ఇచ్చారు. నేను మాట్లాడడానికి ఏమీ మిగల లేదు' అని అన్నారు. అంతే వెంటనే కృతజ్ఞతగా నితిష్‌ కుమార్‌ చిరునవ్వులు చిందిస్తూ మోడీ పాదాలు తాకారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)