ఈఏంఐ చెల్లింపుదారులకు భారీ ఊరట !

Telugu Lo Computer
0


ర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారికి భారీ ఊరట కలగనుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం అనగా ఏప్రిల్ 1 నుంచి లోన్ ఈఏంఐల చెల్లింపుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపు గడువు నాటికి డిఫాల్ట్, ఇతర రుణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రుణగ్రహీతలపై అదనపు జరిమానాలు విధించకూడదు. అంటే ఈఎంఐ చెల్లింపు ఆలస్యం అయితే ఫైన్ కట్టాల్సిన అవసరం  లేదన్నమాట. సాధారణంగా నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ మెుత్తాన్ని ఆలస్యంగా చెల్లించినందుకు బ్యాంకులు ఖాతాదారుల నుంచి జరిమానా వసూలు చేస్తాయి. అయితే ఆర్‌బీఐ కొత్త ఆదేశాల వల్ల ఇకపై బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు.. ఈఎంఐ ఆలస్యంపై జరిమానా, వడ్డీని వసూలు చేయకుండా నిరోధిస్తుంది. లోన్ డిఫాల్ట్ సమయంలో వడ్డీ రేటుకు అదనపు ఛార్జీలను జోడించటాన్ని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే నిషేధించింది. పెనాల్టీ ఛార్జీలపై ఎలాంటి అదనపు వడ్డీని వసూలు చేయవద్దని బ్యాంకులను కోరింది. ఈఎంఐ చెల్లింపుల ఆలస్యం అయితే జరిమానా విధించడాన్ని క్రెడిట్ క్రమశిక్షణకు సంబంధించినదిగా రిజర్వు బ్యాంక్ పేర్కొంది. అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దీనిని ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉపయోగించటాన్ని కేంద్ర బ్యాంకు తప్పుపట్టింది. అంతేకాక బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి పెనాల్టీలు, ఇతర ఛార్జీలు విధిస్తున్నట్లు గమనించింది. ఇక గత కొంత కాలంగా ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదులు పెరగటంతో రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగింది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)