వేసవి కాలం - పెసరపప్పు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


వేసవి కాలంలో పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది.  పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి. తేలికపాటి ఆహారం తినడం వల్ల బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవచ్చు. రెండు రకాల పెసరపప్పు అందుబాటులో ఉంది. ఒకటి పొట్టు తీసిన పెసరపప్పు, పొట్టు తీయని పెసరపప్పు. ఈ పప్పులో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పెసరపప్పు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఇది చాలా సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కావున జీర్ణక్రియలో పెసరపప్పు త్వరగా జీర్ణమవుతుంది. గుండెకు పెసరపప్పు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పెసరపప్పు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల పెసరపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెసరపప్పు తగ్గిస్తుంది. పెసర పప్పు తో చాల రకాలైన వంటకాలను చేసుకోవచ్చు.  ఏ ఆకుకూర అయినా పెసరపప్పుతో కలిపి చేసుకోవచ్చును ఎలా చేసుకోవడం వలన వాటికీ మంచి రుచి వస్తుంది . 

Post a Comment

0Comments

Post a Comment (0)