మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు !

Telugu Lo Computer
0


జ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్నయుద్ధ వాతావరణంతో దేశీయ మార్కెట్లు వరుసగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు కూడా తోడవ్వడంతో దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. గతవారం రికార్డు స్థాయిలో 75వేల మార్కును దాటిన సెన్సెక్స్... ఇవాళ 73 వేల పాయింట్ల దిగువకు చేరింది. మార్కెట్ ముగిసే సమయానికి 456 పాయింట్ల నష్టంతో 72 వేల 943 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. దాదాపు 2 వేల 218 షేర్లు లాభాలు ఆర్జించగా... వెయ్యి 464 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ 124 పాయింట్లు పతనమై.. 22 వేల 147 వద్ద ముగిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)