సల్మాన్‌ఖాన్‌ను కలిసిన సీఎం ఏక్‌నాథ్‌ షిండే !

Telugu Lo Computer
0


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే మంగళవారం మధ్యాహ్నం సల్మాన్‌ను కలిశారు. ముంబయిలో బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌కు సీఎం రాకతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ''రాష్ట్ర ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. ఇప్పటికే నిందితులు అరెస్టయ్యారు. విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో హస్తం ఉన్న ఎవరినీ వదిలిపెట్టం'' అని సల్మాన్‌కు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో గ్యాంగ్ వార్‌లను అనుమతించబోమని, వారి అంతు చూస్తామని (లారెన్స్‌ను ఉద్దేశిస్తూ) అన్నారు. ఆదివారం తెల్లవారుజామున సల్మాన్‌ఖాన్‌ నివాసంపై పలుమార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చిలో సల్మాన్‌ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈమెయిల్స్‌ రావడంతో గ్యాంగ్‌స్టర్లు లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీ బ్రార్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తాజాగా గుజరాత్‌లోని భుజ్‌ జిల్లాలో షూటర్లు వికాస్‌గుప్తా, సాగర్‌పాల్‌లను అరెస్టు చేశారు. ఈ ఘటనతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు సంబంధమున్నట్లు నిందితులు అంగీకరించారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)