తెలంగాణలో దొంగలు పోయి, గజదొంగలు వచ్చారు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల తర్వాత మరింత బలహీనపడే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు.  మరోసారి దేశానికి ఎవరు ప్రధాని కావాలోప్రజలు నిర్ణయం తీసుకున్నారని, అందుకు మోడీనే సరైన నాయకుడిగా గుర్తించారని తెలిపారు. కర్ణాటకలో 90 శాతం ఎంపీ స్థానాలు బీజేపీ గెలుస్తోందని, హైదరాబాద్‌లో రియాల్టర్లు, బిల్డర్లను, వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ కోసం వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోల్డ్ స్టోరేజ్‌లో ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని చెప్పారు. విద్యుత్ కోతలు మొదలయ్యాయన, తాగునీటి ఎద్దడి నెలకొందని అయినా ప్రభుత్వానికి పట్టింపులేదని అన్నారు. రాష్ట్రంలో దొంగలు పోయి, గజదొంగలు వచ్చారని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ పాలన నాలుగు ప్రధాన అంశాలపై సాగుతుందని అన్నారు. భవిష్యత్‌లో ఎట్టి పరిస్థితిల్లోనూ ఎరువుల ధరలు పెంచరాదని కేంద్రం నిర్ణయించిందని అన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)