వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకుంటే రెండు లక్షల రూపాయలు !

Telugu Lo Computer
0


ఝార్ఖండ్ ప్రభుత్వం" విధ్వ పునర్ వివాహ్ ప్రోత్సాహన్ యోజన" అనే పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. వితంతువులను రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. అందులో భాగంగా మొదటి భర్త డెత్ సర్టిఫికేట్‌ను, రెండో పెళ్లికి సంబంధించిన మ్యారేజీ సర్టిఫికేట్‌ను అర్హులైన మహిళలు అధికారులకు సమర్పిస్తే ఆ మహిళ బ్యాంకు ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేస్తున్నారు. అయితే ఇందుకు ఝార్ఘండ్ ప్రభుత్వం ఒక నిబంధన అమలు చేస్తోంది. రెండో పెళ్లి చేసుకున్న ఏడాది లోపే ఈ సర్టిఫికేట్లను సమర్పించిన వారికి మాత్రమే రెండు లక్షల సాయం అందిస్తారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకీ, పెన్షన్లు తీసుకునేవారికీ, ఆదాయపన్ను చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు.

Post a Comment

0Comments

Post a Comment (0)