మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించిన పార్టీ టీడీపీ !

Telugu Lo Computer
0


టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మహిళల ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్రాన్ని మహిళలకు కల్పించిన పార్టీ టీడీపీ అని అన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది టీడీపీనేనని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద నెలకు 15 వందల రూపాయలు అకౌంట్ వేస్తానని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తనలాంటి వాడినే ఎన్నో సార్లు ఏడిపించారు… రాష్ట్ర ప్రజలను ఏడిపించి పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యను అవమానించారని.. మహిళలంటే వైసీపీకి గౌరవం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. కుప్పం ప్రజల ఆశీస్సులు కోసం వచ్చాను.. ఇక్కడికి వచ్చి ఫుల్ చార్జ్ అయి వెళతానని చంద్రబాబు పేర్కొన్నారు. చీకటి వ్యాపారాలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశారు.. ఎన్నికలలో ఓట్ల కోసం వైసీపీ వాళ్ళు డబ్బులతో పాటు గంజాయి, డ్రగ్స్ కూడా ఇస్తారని దుయ్యబట్టారు. 
Post a Comment

0Comments

Post a Comment (0)