విరుధు నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాధిక పోటీ !

Telugu Lo Computer
0


మిళనాడులోని విరుధు నగర్ నుంచి రాధిక శరత్ కుమార్‌కు టికెట్ ఖరారు చేసారు. రీసెంట్‌గా శరత్ కుమార్‌కు చెందిన పార్టీ బీజేపీలో బేషరుతుగా విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19న జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో రాధికకు టికెట్ ఇవ్వడం గమనార్హం. ఇక ఈ ఎన్నికల్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అటు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్.. తాజాగా తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు ఈమెకు బీజేపీ అధిష్ఠానం చెన్నై సౌత్ ఎంపీ టికెట్ ఖరారు చేసింది. దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు మే 13న 4వ విడతలో ఎన్నికల నిర్వహించబోతున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇక అదే రోజున తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ చేయనున్నారు. ఇక ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్టు మెజారిటీ సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ సారి బీజేపీ సొంతంగా 400 సీట్లు క్రాస్ చేస్తుందా అనే చర్చ మొదలైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)