పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన !

Telugu Lo Computer
0


దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూ జాబితా రిలీజ్ చేసింది.ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.మార్చి 29, 30 తేదీల్లో మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్,అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్‌బ్యాక్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.అలాగే హిమాలయ జార్ఖండ్, ఒడిశా,వెస్ట్ బెంగాల్, సిక్కిం, బీహార్, హర్యానా, చండీగఢ్,పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లో మార్చి 27-31 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)