ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 10 మంది అభ్యర్థులతో తుది జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఎచ్చర్ల ఈశ్వరరావు, విశాఖపట్నం వెస్ట్ విష్ణు కుమార్ రాజు, అరకు  రాజారావు, ధర్మవరం సత్యకుమార్, అనపర్తి శివకృష్ణ రాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, బద్వేలు బొజ్జ రోషన్, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఆదోని పార్థసారథి బరిలోకి దిగుతున్నారు. సుజనా చౌదరి రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడంతో ఈ సారి అసెంబ్లీ బరిలో విజయవాడ వెస్ట్ నుంచి పోటీలో నిలవనున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా తాజాగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే భాజపా ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)