ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం దేశంలోనే అత్యంత భారీ స్కామ్‌ !

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈడీ, సీబీఐ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలు దాడులు జరిపిన కంపెనీలే ఈ ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేయడంపై పలు పార్టీలకు చెందిన నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్టోరల్‌ బాండ్స్‌పై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల ప్రధాన లబ్ధిదారుగా బీజేపీ ఉన్నదని సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని అన్నారు. గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసి నిధులను నేరుగా ఆయా పార్టీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నాయని విమర్శించారు. గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కార్పొరేషన్ ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసిందని, ఆ డబ్బులు నేరుగా అధికార బీజేపీ ఖాతాలో జమయ్యాయని రౌత్‌ ఆరోపించారు. ఇలాంటివి గతంలో కూడా చాలానే జరిగాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తూ కంపెనీలు రాజకీయ పార్టీలకు నగదు బదిలీ చేయడమనేది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రౌత్ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కంపెనీలపై ఇటీవల ఈడీ దాడులు జరిగాయని, ఆ తర్వాత ఆ కంపెనీలు ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేశాయని రౌత్‌ గుర్తుచేశారు. ప్రజలు వీటిని నిత్యం గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ముందుగా ఈడీ దాడులు చేస్తుందని, కొన్ని గంటల తర్వాత ఆయా కంపెనీలు ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేస్తాయని విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)