సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై పెట్టిన కేసులు ఎత్తివేత!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకునట్లు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులపై నమోదైన 6 కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో.. మున్సిపల్‌ కార్మికులపై ఫిర్యాదు చేశారు మున్సిపల్‌ అధికారులు.. దీంతో, వారిపై కేసులు పెట్టారు పోలీసులు.. కానీ, ఆ సమయంలో మున్సిపల్ అధికారుల చేసిన ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈమేరకు డీజీపీకీ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి లేఖ రాశారు.. మున్సిపల్‌ కార్మికుల సమ్మె సమయంలో ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు స్పష్టం చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)