మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిటిషన్‌ ను తిరస్కరించిన హైకోర్టు !

Telugu Lo Computer
0


తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గన్‌మెన్లు కావాలన్న పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తనకు ప్రాణహాని ఉందని, 4+4 భద్రత కల్పించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ప్రతి ఒక్కరికి భద్రత కేటాయించడం సాధ్యం కాదన్న ధర్మాసనం.. శ్రీనివాస్‌ గౌడ్‌కు గన్‌మెన్‌లు అవసరమా? లేదా ? అనే విషయాన్ని తెలియజేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)