దక్షిణ భారత దేశ ఫిల్టర్ కాఫీకి రెండో స్థానం !

Telugu Lo Computer
0


ప్రపంచంలోని టాప్ 38 కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీకి రెండవ స్థానం లభించింది. ప్రసిద్ధ ఆహారం, ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల కాఫీ, బ్రూడ్ సుగంధ పానీయాల గ్లోబల్ రేటింగ్‌ను రిలీజ్ చేసింది.. అందులో మన దేశం కాఫీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానంలో క్యూబా ఎస్ప్రెస్సో ఉంది. దక్షిణ భారత ఫిల్టర్ కాఫీ తర్వాతి స్థానంలో ఉంది. కాఫీ క్యూబానో లేదా క్యూబన్ ఎస్ట్రేసో అని కూడా పిలుస్తారు.కాఫీ ఫిల్టర్‌లో వేడి కండెన్స్‌డ్ మిల్క్ మరియు చక్కెర కలపడం ద్వారా కాఫీ తయారుచేస్తారు. కాఫీని సాధారణంగా స్టీల్ లేదా ఇత్తడి లేదా గాజు కప్పులో అందిస్తారు… ఈ కాఫీని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  రోజులో రెండు మూడు కప్పుల ఫిల్టర్ కాఫీని తాగే వారిలో డయాబేటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట. యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుంది.. ఇందులో ఉండే న్యాచురల్ కంటెంట్ ఎక్కువ సేపు ఆకలి లేకుండా డైట్ కంట్రోల్ చేస్తుంది. దాంతో బరువు కూడా తగ్గవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)