జోమాటో మహిళా డ్రైవర్స్ కు కొత్త డ్రెస్ కోడ్‌ !

Telugu Lo Computer
0


జోమాటో తమ కస్టమర్ల తో పాటు డెలివరీ బాయ్స్, గర్ల్స్ కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ను ఇస్తుంది.. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, జొమాటో మహిళా డెలివరీ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ రోజు నుండి జోమాటో మహిళా డెలివరీ ఉద్యోగులు కుర్తా ధరించడాన్ని ఎంచుకోవచ్చు అని కంపెనీ పోస్ట్ శీర్షికలో రాసింది. దానితో పాటు, మహిళా డెలివరీ డ్రైవర్లు కొత్తగా రూపొందించిన కుర్తాలను ధరించిన వీడియోను కూడా వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి చాలా బాగున్నాయని వారు చెప్పుకొచ్చారు.. ఈ వీడియోను కొన్ని గంటల క్రితమే షేర్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియోను మూడు లక్షల మంది చూసారు.. అలాగే 46 వేల కంటే ఎక్కువ లైక్‌లు మరియు అనేక కామెంట్‌లు కూడా వచ్చాయి. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

Post a Comment

0Comments

Post a Comment (0)