ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు !

Telugu Lo Computer
0


గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీకి నకిలీ డాక్యుమెంట్లతో ఆయుధాల లైసెన్సు పొందిన కేసులో జీవిత ఖైదు పడింది. వారణాసి ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అవినాష్ గౌతమ్ బుధవారం నాడు ఈ తీర్పు వెలువరించారు. పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న ముఖ్యార్ అన్సారీ 2021 నుంచి బాండా జైలులో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయనను కోర్టు ముందు హాజరయ్యారు. ముఖ్తార్ అన్సారీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నకిలీ డాక్యుమెంట్లతో ఆయుధాల లైసెన్స్ పొందినట్టు 1990లో సీబీసీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆయనతో పాటు ఆయుధాల క్లర్క్ గౌరీ శంకర్‌లాల్‌ను కూడా కేసులో చేర్చింది. అప్పటి డీఎం అలోక్ రంజన్, ఎస్పీ దేవరాజ్ నగర్ ఫోర్జరీ సంతకాలతో ముఖ్తార్ అన్సారీ ఆయుధాల లైసెన్స్ సంపాదించినట్టు సీబీసీఐడీ ఆరోపణగా ఉంది. కాగా, 1997లో బొగ్గు వ్యాపారి మహావీర్ ప్రసాద్‌ను చంపుతామని బెదిరించిన కేసులో అన్సారీని దోషిగా పేర్కొంటూ 2023 డిసెంబర్‌లో కూడా ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఐదున్నరేళ్ల పాటు జైలుశిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. మవూ (Mau) నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే మహూ నుంచి సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) అభ్యర్థిగా ఆయన కుమారుడు అబ్సాస్ అన్సారీ పోటీచేసి గెలుపొందాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)