టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా రేపు ప్రకటిస్తాం !

Telugu Lo Computer
0


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందని ఆయన తెలిపారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు కూడా వారి అభ్యర్థులను ప్రకటిస్తాయని అన్నారు.. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)