జైలు నుంచే సీఎంగా కేజ్రీవాల్ తొలి ఆదేశాలు జారీ !

Telugu Lo Computer
0


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆ రాష్ట్ర సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జైలు నుంచి సీఎం హోదాలో తొలిసారి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జైలు నుంచే ఆయన పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపాయి. ఈ మేరకు నేడు ఈడీ లాకప్ నుంచే తన మొదటి ఆర్డర్ ను రిలీజ్ చేశారు. రాజధానిలో నీటి సరఫరా గురించి ఆ రాష్ట్ర జలమంత్రిత్వ శాఖ మంత్రి అతిశీకి ఆయన నోట్ ద్వారా ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఈ నోట్ గురించి అతిశీ మీడియాకు వెల్లడించనున్నారు. కాగా, ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న సీఎం కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా గురువారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కేజ్రీవాల్ కు కోర్టు వారం రోజుల పాటు కస్టడీ విధించింది. ఈ క్రమంలో సీఎంను అరెస్టు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సీఎంను అరెస్టు చేయాలని బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ కక్ష్యతోనే ఈడీ పేరుతో గేమ్స్ ఆడుతుందని మండిపడుతున్నారు. తమ సీఎంను అరెస్టు చేసినా ఆయన జైలు నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆప్ నేతలు స్ఫష్టం చేస్తున్నారు. కానీ జైలు నుంచి పాలన సాధ్యం కాదని ఢిల్లీ సీనియర్ లాయర్ సునీల్ గుప్తా అన్నారు. జైలు నుంచి పాలన చేయడం సులువు కాదని అన్నారు. జైలు నిబంధనల ప్రకారం ఏ వ్యక్తికి అయిన వారంలో రెండు సార్లు మాత్రమే తన స్నేహితులుచ బంధువులు, కుటుంబసభ్యులను కలిసే అవకాశం ఉంటుందని… ఈ నేపథ్యంలో జైలు నుంచి పాలన చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)