కాంగ్రెస్ ను వీడిన నవీన్ జిందాల్ !

Telugu Lo Computer
0


ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ హస్తాన్ని వీడారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం బీజేపీలో చేరారు. ఆయన గతంలో హర్యానా కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరడం గమనార్హం. ''నేను కురుక్షేత్ర నుండి పార్లమెంటులో 10 సంవత్సరాలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించాను. కాంగ్రెస్ నాయకత్వానికి మరియు అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ధన్యవాదాలు. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను'' అని కాంగ్రెస్‌ని, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాజీనామా ప్రకటన చేసిన కొన్ని గంటలకే న్యూఢిల్లీలో బీజేపీలో చేరారు. ''ఈ రోజు నా జీవితంతో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు నేను బీజేపీలో చేరినందుకు గర్వపడుతున్నాను. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశానికి సేవ చేయగలుగుతున్నారు. ప్రధాని కలల 'విక్షిత్ భారత్'కి నేను సహకరించాలని అనుకుంటున్నాను.'' అని బీజేపీలో చేరిన తర్వాత నవీన్ జిందాల్ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)