తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి హోలీ శుభాకాంక్షలు !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అన్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్తవర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)