ఎమ్మెల్సీ కవితకు జైల్లో వెసులుబాటు కల్పించిన కోర్టు !

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో అధికారులు తీహార్ జైలుకు తరలించారు. కవిత విజ్ఞప్తి మేరకు జైల్లో వెసులుబాటు కల్పిస్తూ తీహార్ జైలు సూపరింటెండెంట్‌ కు ఆదేశాలు జారీ చేసింది. ఇంటి భోజనం తెచ్చుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే కవిత పడుకోవడానికి మంచం, పరుపులు, దుప్పట్లు, వేసుకోవడానికి చెప్పులు, దుస్తులు, చదువుకునేందుకు పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అలాగే పెన్ను, పేపర్లు, ఆభరణాలు, మందులు తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1 నాటికి సమాధానం ఇవ్వాలని ఈడీకి ఆదేశాలిచ్చింది. మద్యం కేసులో ఇప్పటికే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ.. అడ్జ్యూడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను సీల్డ్ కవర్ లోనే కవిత న్యాయవాదులకు ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. సీల్డ్ కవర్ లో ఈడీ ఇచ్చిన వాటిని “కాన్ఫిడెన్షియల్” గానే ఉంచాలని కవిత న్యాయవాదులకు న్యాయస్థానం సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)