ఇంట్లో వైఫై రూటర్ ఎక్కడ ఇన్‌స్టాల్‌ చేయాలి ?

Telugu Lo Computer
0


వైఫై రూటర్ ఎల్లప్పుడూ ఇంటి మధ్య ప్రాంతంలో ఇన్‌స్టాల్‌ చేయాలి. దీనివల్ల ప్రతి గదికి మంచి కవరేజీని అందిస్తుంది. రూటర్‌ను ఇంట్లో కవర్ చేయబడని ప్రదేశంలో ఇన్‌స్టాల్‌ చేస్తే దీని కారణంగా ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గుతుంది. రూటర్‌ని ఇంట్లో క్లోజ్‌చేసిన గదిలో ఇన్‌స్టాల్‌ చేయకూడదు. దీనివల్ల ఆ రూమ్‌ వరకే ఇంటర్నెట్‌ పరిమితమవుతుంది. మిగతా రూమ్‌లకు రాదు. రూటర్‌ను స్టూల్ లేదా టేబుల్‌పై ఉంచడం చాలా ఇళ్లలో కనిపిస్తుంది. దీని కారణంగా ఇంటర్నెట్ స్పీడ్‌ తగ్గుతుంది. రూటర్ ఎల్లప్పుడూ కొంత ఎత్తులో ఇన్‌స్టాల్ చేయాలి. ఇది అప్పుడే ప్రతి గదికి సమాన పరిధిని అందిస్తుంది ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగా ఉంటుంది. చాలా అంతస్తుల ఇళ్లు అయితే మీరు మధ్య అంతస్తులో మాత్రమే రూటర్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మీ పై అంతస్తుల వారికి కింది అంతస్తుల వారికి ఇంటర్నెట్ అందుతుంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో రూటర్‌ని ఇన్‌స్టాల్‌ చేస్తే అక్కడి వరకు మాత్రమే పరిమితమవుతుందని గుర్తుంచుకోండి. అలాగే రూటర్‌ రెండు అంతస్తుల వరకు మాత్రమే ఇంటర్నెట్‌ అందిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)