పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు సంక్షేమ కార్యదర్శుల ఆథరైజేషన్ తప్పనిసరి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచిన ఈసీ, ఇప్పుడు పెన్షన్ల పంపిణీ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్లు పంపిణీ చేసే వాలంటీర్లతో పాటు వాటిని బ్యాంకుల నుంచి డ్రా చేసే సచివాలయ సిబ్బందికి సైతం ఆథరైజేషన్ ను తప్పనిసరి చేసింది. వీరిపై ఉన్నతాధికారులుగా ఉన్న ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శ, సంక్షేమ కార్యదర్శులకు ఆథరేజైషన్ జారీ చేయాలని సెర్ప్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాలంటీర్లతో పాటు సచివాలయ విధుల్లో ఉన్న సంక్షేమ కార్యదర్శులు కూడా ఈ ఆథరేజేషన్ తీసుకుంటేనే పింఛన్ల వ్యవహారంలో తలదూర్చేందుకు వీలుంటుంది. లేకపోతే ఎన్నికల కోడ్ మేరకు వీరిని దూరంగా ఉంచాల్సిన పరిస్దితి. దీంతో వాలంటీర్లు, సంక్షేమ కార్యదర్శులకు ఈ మేరకు ఆథరేజేషన్ తీసుకోవాలని సెర్ప్ నుంచి ఆదేశాలు వెళ్తున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ లోపు వీరు తప్పనిసరిగా ఆథరేజేషన్ తీసుకుంటేనే పెన్షన్ల సజావుగా పంపిణీ చేసేందుకు వీలు కలుగుతుంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)