సీబీఎస్ఈ కొత్త సిలబస్ విడుదల !

Telugu Lo Computer
0


కేంద్ర ప్రాథమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) వచ్చే విద్యా సంవత్సరానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 10, 12 తరగతులకు కొత్త సిలబస్ ను విడుదల చేసింది. 2025లో జరిగే బోర్డు పరీక్షల కోసం ఈ సిలబస్ ను రూపొందించింది. వచ్చే విద్యా సంవత్సరం కోసం సిలబస్ ను సెకండరీ (9, 10 తరగతులు), సీనియర్ సెకండరీ (11, 12 తరగతులు)గా విభజించారు. అధికారిక వెబ్ సైట్లో వీటిని అందుబాటులో ఉంచింది. సీబీఎస్ఈ 10, 12 తరగతుల కరిక్యులమ్ నోటీసు 2024-25 పేరుతో వెబ్ సైట్ లో దీన్ని అందుబాటులో ఉంచారు. విద్యార్థులు కరిక్యులమ్ కోసం బోర్డు అధికారిక వెబ్ సైట్ www.cbseacademic.nic.inను సందర్శించాలి. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో 'అకడమిక్' ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. సెకండరీ, సీనియర్ స్కూల్ కరికులమ్ 2024-25 సెషన్ లింక్ ను క్లిక్ చేస్తే ఓ పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవాలి. సీబీఎస్ఈ 10, 12 తరగతుల సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే.. ముందుగా www.cbseacademic.nic.in/curriculum_2025.htmlలో పాఠ్యాంశాల విభాగాన్ని సందర్శించాలి. 9-10 తరగతుల సిలబస్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, 'సెకండరీ కరికులమ్ (IX-X) అని ఉన్న ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. వ్యక్తిగతంగా డౌన్‌లోడ్ చేసుకోగల మొత్తం సిలబస్ సబ్జెక్ట్ వారీ ఉంటుంది. 11-12 తరగతుల సిలబస్ కోసం సీనియర్ సెకండరీ కరికులమ్ (XI-XII)'పై క్లిక్ చేయాలి. మళ్లీ ఇక్కడ సిలబస్ సబ్జెక్ట్ వారీ బ్రేక్‌డౌన్‌ ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 3, 6 తరగతులకు కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలను త్వరలో విడుదల చేస్తుందని సీబీఎస్ఈ ప్రకటించింది. కొత్త సిలబస్ ప్రస్తుతం తయారు చేస్తున్నారని, త్వరలో విడుదల చేస్తారని వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)