తిరుమలలో 20 నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు !

Telugu Lo Computer
0


తిరుమలలో ఈ నెల 20వ తేదీన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్షిక తెప్పోత్సవాల సందర్భంగా ఈ నాలుగు రోజుల పాటు శ్రీమలయప్ప స్వామివారు పుష్కరిణీలో రాత్రి వేళ తెప్పపై విహరిస్తారు. దేవేరులతో కలిసి వేర్వేరు అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. తొలిరోజు శ్రీరామచంద్రమూర్తి, సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా పుష్కరిణిలో మూడు ప్రదక్షిణలు చేస్తారు. రెండోరోజున రుక్మిణీ సమేత శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారంలో తెప్పపై ఊరేగుతారు. మూడవ రోజున భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పుష్కరిణిలో తెప్పపై భక్తులను అనుగ్రహిస్తారు. నాలుగవ రోజు అయిదు ప్రదక్షిణలు, చివరి రోజున ఏడు ప్రదక్షిణలు చేస్తారు. దీనితో తెప్పోత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఈ నెల 20, 21 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ, 22, 23, 24 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవను రద్దు చేసినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)