రాహుల్‌ గాంధీకి ఫండ్స్‌ పంపటానికి వ్యాపారులకు రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు !

Telugu Lo Computer
0


రాహుల్‌ గాంధీకి ఫండ్స్‌ పంపటానికి తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపణలు చేశారు. వ్యాపారులను బెదిరిస్తున్న చిట్టా రికార్డు అవుతున్నదని అన్నారు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలో అన్నీ తానేనని రేవంత్‌ విర్రవీగుతున్నారని, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నడమంత్రపు సిరిలా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్‌, రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించటానికి సిద్ధంగా లేరని హెచ్చరించారు. మల్కాజిగిరిలో ఎవరు వచ్చినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గెలిచేది బీజేపీయేనని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)