తగ్గిన బంగారం,వెండి ధరలు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో బంగారం ధర  రూ.1000 పైగా తగ్గాయి. హైదరాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 లకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,150 వద్ద, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.680 తగ్గి రూ.62,310 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.62,180 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 దిగొచ్చి రూ.57,500లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.650 క్షీణించి రూ.62,730 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.600 తగ్గి రూ.57,000 లకు చేరింది. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు (ఫిబ్రవరి 14) కేజీకి ఏకంగా రూ. 1500 తగ్గింది. హైదరాబాద్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,500లుగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)