ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌, తైవాన్‌ సహాయ బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోదం !

Telugu Lo Computer
0


మెరికా సెనెట్‌ ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌, తైవాన్‌లకు 9,530 కోట్ల డాలర్ల సహాయం అందించడానికి ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది. ఇందులో 6,000 కోట్ల డాలర్లను ఒక్క ఉక్రెయిన్‌కే కేటాయించారు. ఉక్రెయిన్‌కు సహాయాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నందున బిల్లు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉంది. చివరకు 22 మంది రిపబ్లికన్లు పాలక డెమోక్రాట్లతో చేతులు కలపడంతో సెనెట్‌లో బిల్లు 70-29 ఓట్లతో నెగ్గింది. సెనెట్‌లో డెమోక్రాట్లకు స్వల్ప మెజారిటీ ఉన్నా దిగువ సభలో రిపబ్లికన్లదే పైచేయి. అక్కడ దీన్ని వ్యతిరేకిస్తామని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ విధేయులు తెగేసి చెబుతున్నారు. నాటో దేశాలు రక్షణ రుసుమును చెల్లించకపోతే వాటిపై దాడి చేయాల్సిందిగా రష్యాను పురిగొల్పుతానని ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. ఎస్తోనియా ప్రధాని కాజా కల్లాస్‌ను తన వాంటెడ్‌ జాబితాలో రష్యా చేర్చింది. నాటో దేశమైన ఎస్తోనియాలోని రెండో ప్రపంచ యుద్ధం నాటి స్మారకాన్ని తొలగించినందుకు ఆమెను ఈ జాబితాలో చేరుస్తూ రష్యా హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. ఆమెపై నేర అభియోగాలను మోపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)