ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ సిటీకి దగ్గరలో త్వరలోనే సెకండ్ ఫేస్ జీనోం వ్యాలీ ని ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాథమికంగా సుమారు 300 ఎకరాల్లో రెండు వేల కోట్లు పెట్టుబడితో ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. చివరికి లక్ష కోట్లు పెట్టుబడులతో పది ఫార్మా విలేజిలని ఏర్పాటు చేసే ప్రాసెస్ ఇప్పటికే మొదలైందని చెప్పారు. మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి అని చెప్పారు. 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అన్నారు. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోడేసియా సదస్సుని హైటెక్స్ లో మంగళవారం ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. వికారాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్ లు వస్తాయని చెప్పారు

Post a Comment

0Comments

Post a Comment (0)