గజల్ మాస్ట్రో పంకజ్‌ ఉద్దాస్‌ మృతి

Telugu Lo Computer
0


లెజెండ్రీ గాయకుడు, గజల్ మాస్ట్రో పంకజ్‌ ఉద్దాస్‌ సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్న మరణించారు. పంకజ్ ఉదాస్ అ నేక ఆల్బమ్‌లను విడుదలచేశారు.  ప్రపంచవ్యాప్తంగా కచేరీలిచ్చారు. మధురమైన గాత్రంతోనే కాదు, పదునైన సాహిత్యంతో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. గజల్‌ పంకజ్‌.. పంకజ్‌ గజల్‌. 'చిట్టి ఆయీ హై', 'జీయే తో జీయే కైసే', 'చుప్కే చుప్కే' 'ఔర్ అహిస్తా', 'జీయే తో జీయే కైసే' లాంటి పాటలతో దశాబ్దాల పాటు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గళం మూగపోయింది. కానీ తరతరాలుగా శ్రోతల చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పంకజ్‌ ఉద్ధాస్‌ మరణంతో యావత్‌ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కాలం పగబట్టిందేమో.. పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు అంటూ కన్నీటి పర్యంత మవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆర్‌ఐపీ పంకజ్‌ ఉద్దాస్‌ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)