ఊర్వశి రౌతేలా పుట్టిన రోజు కేక్‌ ధర అక్షరాల రూ.3 కోట్లు !

Telugu Lo Computer
0


హీరోయిన్‌ ఊర్వశి రౌతేలా నిన్న 30వ పుట్టినరోజుని జరుపుకుంది. ఆమె పుట్టినరోజుకు ప్రఖ్యాత గాయకుడు యోయో హనీ సింగ్ ఆమె కోసం ప్రత్యేకంగా కేక్‌ తయారుచేయించాడు. ఆ కేక్‌ విలువ అక్షరాలా మూడు కోట్ల అంట!. అంతలా కేక్‌ ధర ఉండడానికి కారణం ఆ కేక్‌ 24 క్యారెట్ల బంగారం పూత పూసి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ కేక్‌ను చూసి ఆ హీరోయిన్‌ ఉబ్బితబ్బిబయ్యింది.  ఈ కేక్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఊర్వశి రౌతౌలా 'లవ్‌ డోస్‌ 2' ప్రాజెక్టుకు పని చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు చిత్రీకరణ సాగుతోంది. షూటింగ్‌ సెట్‌లోనే రౌతౌలాతో యోయో హనీసింగ్‌ కేక్‌ కోయించాడు. ఈ విషయాన్ని ఊర్వశీ తన సోషల్‌ మీడియాలో పంచుకుంది. 'నా ప్రయాణంలో నీ పాత్ర మరువలేనిది. నువ్వు హాజరుకావడం చాలా ఆనందంగా ఉంది. నీ కృషి, సహాయంతో నేను జీవితంలో ఈ స్థాయిలో ఉన్నా' అని ఊర్వశీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకుంది. ఈ సందర్భంగా ఐదు ఫొటోలను పంచుకుంది. సినీ పరిశ్రమలో ఊర్వశీ, యోయో హనీ సింగ్‌ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఆమె జీవితంలో హనీసింగ్‌ పాత్ర కీలకం. 'మిస్‌ యూనివర్స్‌'గా 2015లో కిరీటం గెలుచుకున్న ఊర్వశీ రౌతౌలా అనంతరం సినిమాల్లోకి ప్రవేశించారు. 'సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌' సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. ఊర్వశీ సనమ్‌ రే, గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ, హేట్‌ స్టోరీ 4, పగల్‌పంటి వంటి సినిమాలతో ఊర్వశీ విజయాలన్నందుకుంది. ఇక తెలుగులో చూస్తే 'వాల్తేరు వీరయ్య'లో బాస్‌ పార్టీ పాటకు ఊర్వశీ ప్రత్యేకంగా మెరిసిన విషయం తెలిసిందే. అఖిల్‌ సినిమాలో 'వైల్డ్‌ సాలా సాగ్‌, 'బ్రో' సినిమాలో మైడియర్‌ మార్కండేయ, స్కందలో 'కల్ట్‌ మామ' పాటలో ఊర్వశీ నర్తించింది. ప్రస్తుతం చేతిలో బోలెడన్నీ సినిమాలతో ఆమె బిజీగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)