పులిని చంపి, దాని దంతాన్నే ధరించా !

Telugu Lo Computer
0


హారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్1987లో పులిని షికారీ చేసినట్లు చెప్పారు. 37 ఏళ్ల క్రితం వేటకు వెళ్లి పులిని హతమార్చినట్లు వెల్లడించారు. ఆ పులికి చెందిన దంతాన్నే తన మెడలో ధరించినట్లు ఆయన తెలిపారు. విదర్భ ప్రాంతంలో ఉన్న బుల్దానా నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెడలో ఉన్న పులి భాగం ఏంటని ఓ వ్యక్తి అడగ్గా ఆ ఎమ్మెల్యే దాని గురించి వివరించారు. ఇది పులి పన్ను అని, 1987లో ఓ పులిని వేటాడానని, దాని దంతాన్ని తీసినట్లు ఎమ్మెల్యే గైక్వాడ్ తెలిపారు. సోమవారం శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఉద్దవ్ ఠాక్రేకు చెందిన ప్రత్యర్థి శివసేన వర్గం ఆ వీడియోను సామ్నా ఆన్‌లైన్ ఎడిషన్‌లో పోస్టు చేశారు. దేశంలో పులులు వేటాడడం చట్టరీత్యా నేరం. 1987 కన్నా ముందు నుంచి ఆ చట్టం అమలులో ఉన్నది. ఎమ్మెల్యే గైక్వాడ్‌పై చర్యలు తీసుకోవాలని ఉద్ధవ్ వర్గం డిమాండ్ చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)